RS Praveen Kumar : ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మొదట పశువైద్యాధికారి. ఆ తరువాత సివిల్ సర్వీస్ లో ప్రతిభ చాటి IPS అధికారిగా ఎంపిక. పోలీస్ అధికారిగా వివిధ హోదాల్లో భాద్యతలు నిర్వహించారు. అనంతరం గురుకుల సొసైటీ కార్యదర్శి గా భాద్యతలు చేపట్టారు. ఒక రాష్ట్ర అధికారిగా ఇంతకంటే మంచి పోస్ట్ పోలీస్ అధికారులకు దక్కదు. విద్యారంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అదృష్టం ఆయనకే దక్కింది. అంత మంచి భాద్యతను పక్కకు పెట్టేసి రాజకీయాల్లో అడుగుమోపారు……
బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం. ప్రధాన పార్టీల అధ్యక్షులతో సమానంగా రాష్ట్ర అధ్యక్ష హోదాలో ఆయనకు అంత గౌరవం దక్కింది. కేసీఆర్ ఏమి హామీ ఇచ్చాడో ప్రవీణ్ కుమార్ కు తెలుసు. హామీ ఇచ్చిన కేసీఆర్ కె తెలుసు. ఎంపీ టికెట్ ఇచ్చాడు కేసీఆర్. కానీ కేసీఆర్ అయన గెలుపు కోసం ప్రచారం కూడా చేయలేదు. ఓటమిని మూటగట్టుకున్నారు. బీఎస్పీ అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడే నా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నదని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. అంటే కేసీఆర్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పకనే చెప్పేశారు ప్రవీణ్ కుమార్.
తాజాగా ప్రవీణ్ కుమార్ ను వాగ్మూలం ఇవ్వాలంటూ సిట్ అధికారులు పిలవడం జరిగింది. అందుకు నేను రానంటున్నారు. బీఎస్పీ అధ్యక్ష హోదాలో కేసీఆర్ పై ఒంటికాలు పై లేచి విమర్శలు చేశారు ప్రవీణ్ కుమార్. పలు సందర్భాల్లో తన ఫోన్ కేసీఆర్ ట్యాప్ చేస్తున్నారని కూడా ఆరోపించారు. అప్పుడు ఆరోపణలు చేసి ఇప్పుడు రానంటే కుదరదు. ఏది ఏమైనప్పటికి అప్పటి మాటకు కట్టుబడి సిట్ ముందు నిజాలు చెబుతారా ? నేను ఎప్పుడు అన్నాను అంటూ దాట వేస్తారా అనేది చూడాలి. ఏది చెప్పిన కరువు మంటే కప్పకు కోపం… విడువు మంటే పాము కు కోపం అనే సామెతను గుర్తుకు చేస్తుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిస్థితి అనంటున్నారు రాజకీయ శ్రేణులు.

by