Vedam : ఇంటి ఆవరణలో మంచి గాలి కోసం చెట్లను పెంచుతారు. కొందరు పూల కోసం మొక్కలు నాటుతారు. పళ్ళ మొక్కలు, కూరగాయల మొక్కలు నాటుతారు. వీటిలో చాలా మంది ఇంటి ఆవరణలో అరటి చెట్లు కూడా నాటుతారు. అరటి చెట్లు నాటడం వలన ఇంటి కుటుంబ సబ్యులకు జరిగే పరిణామాల గురించి ఈ విధంగా చెబుతన్నారు.
అరమొక్కను ఇంటిముందు నాటరాదు. ఇంటికి వెనుక భాగంలో నాటుకోవాలని వేదంలో చెప్పబడింది. తూర్పు, ఉత్తర దిశలోనే నాటుకోవాలి. అరటిచెట్టుకు నీరుపోసి, అగర్ బత్తి వెలిగించడం వలన ఐశ్వర్యం కలుగుతుంది. సానుకూల శక్తిని ప్రసరిస్తుంది. విద్యాభివృద్ధి చెందుతుంది. లక్ష్మిదేవికి ప్రసాదంగా సమర్పిస్తే దీవెనలు అందుకుంటారు. గురు గ్రహం యొక్క శుభ ఫలితాలు పొందుతారు.
మొక్కను నాటిన కుటుంబానికి సంతోషం, సిరిసంపదలకు లోటుండదు. కష్టాలను తొలగిస్తుంది. పిల్లలు సంతోషంగా, చదువులో ముందుంటారు. అరటి చెట్టు శాంతి, సిరి సంపదలకు, ఆహారం కు ప్రతీక. గురుగ్రహానికి అనుబంధం. గురువు అశుభ స్థితిలో ఉంటె వారు ఆ ఇంటి ఆవరణలో మొక్కను నాటి ఐదు వారల పాటు పూజ చేసినచో దోషం తొలగిపోతుందని వేద పండితులు చెబుతున్నారు.