Singareni : దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా జూలై 9న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఒక్క రోజు సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని వివిధ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. రామగుండం – 1 ఏరియాలోని జీడీకే – 2ఏ గని వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్ లో ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ , ఏ ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర అధ్యక్షులు జీ రాములు, టీ ఎస్ యు ఎస్ నాయకులు పోగుల శేఖర్, టీ ఎన్ ఎన్ టి యు సీ నాయకులు రాజనర్సు. లు మాట్లాడుతూ…..
కార్మికులు అనేక పోరాటాలతో,త్యాగాలతో సాధించిన కార్మిక చట్టాలను సాధించుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం వాటిని కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చడానికి కుట్రపన్నుతోందని ఆరోపించారు. ప్రభుత్వం రెండవసారి అధికారంలో వచ్చిన తర్వాత కరోనా సమయంలో పార్లమెంటులో 29 కార్మిక చట్టాలను 4 కోడ్స్ గా బిల్లు ఆమోదం తెలిపింది. ఆ చట్టాలను ఇప్పటి వరకు కూడా అమలు చేయకుండా ఉన్నదంటే కేవలం కార్మికులు, సంఘాల నాయకుల ఐకమత్యమే ప్రధానమన్నారు.
4 కోడ్స్ కు వ్యతిరేకంగా జూలై 9 న జరగబోయే ఒక్కరోజు సమ్మెలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. లేదంటే 12 గంటల పని దినంతో పాటు కార్మికులు బానిసత్వంలోకి నెట్టివేయబడతారని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమం లో సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు ఈ నరేష్, ఐ రాజేశం, ఎం కొమరయ్య,ఎస్ ప్రసాద్, సంపత్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.