Kaleswaram : కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పనులు మొదలు పెట్టిన నాటి నుంచి మొదలుకొని ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం అయ్యే వరకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కే గొప్పలు దక్కినవి. కానీ నేడు కాళేశ్వరం అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ చంద్రఘోష్ ముందు మాత్రం కేసీఆర్ యూటర్న్ తీసుకోవడం విశేషం. అర్హతలు లేనటువంటి ప్రాజెక్ట్ విషయంలో ఎన్ని పేరుప్రతిష్టలు వచ్చినా ఇబ్బంది రాలేదు. విచారణలో కమిషన్ ముందు ప్రాజెక్ట్ కర్త, కర్మ, క్రియ అంతా నేనే అనడానికి వీలు లేకుండా పోయింది. అందుకనే కేసీఆర్ కాళేశ్వరం కు అన్నీ తానై చేసినప్పటికీ , తాను కాదు చేసిందంతా ఇంజనీర్లే అంటూ కమిషన్ ముందు సున్నితంగా తోసేశారు. పుంపు హౌస్ లో నీటిని నిల్వ చేయడంలో తానెలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కేసీఆర్ కమిషన్ ముందు చెప్పేసి చేతులు దులుపుకున్నారు. అంతే కాదు బ్యారేజీల నిర్మాణం కోసం స్థలాలను ఎంపిక చేయడంలో కూడా పూర్తిగా సాంకేతికంగానే జరిగిందన్నారు.
2014 నుంచి 2022 వరకు కాషాయం పెద్దలతో గులాబీ అధినేత మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం కొనసాగింది. ఆ వాతావరణంలో గులాబీ ఎంపీలు రాష్ట్రపతి ఎన్నిక, వ్యవసాయ చట్టాలు, నోట్ల రద్దు తదితర బిల్లులకు అండగా నిలిచారు. ఆ వాతావరణంలోనే తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదంటూ సీడబ్ల్యూసీ ధ్రువీకరణ పత్రం అందజేసింది. ఆ అనుబంధం బెడిసికొట్టడంతో కాషాయం ఢిల్లీ పెద్దలు కేసీఆర్ పై దుమ్మెత్తి పోయడం ఆరంభించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అంటూ మోదీ, అమిత్ షా తో పాటు రాష్ట్ర అగ్రనాయకులు సైతం విరుచుకుపడిన విషయం తెలిసిందే.
2019–20 లో 2046 టీఎంసీల నీరు విడుదల అయ్యింది. అదేవిదంగా 2021-22 లో 2671 టిఎంసిల నీరు, 2023-24 లో 4,628 టీఎంసీ ల నీరు విడుదల అయ్యింది. మూడేళ్లలో 9వేల పైబడి టిఎంసిల నీరు మేడిగడ్డ నుంచి విడుదల చేసారు అధికారులు. మేడిగడ్డ కుంగినప్పుడు 1940 టీఎంసీల నీరు మాత్రమే వృధా అయ్యింది. అంటే మూడేళ్ళలో నిల్వ అయిన నీరు సుమారు 80 శాతం పైబడి తుమ్మిడిహట్టి నుంచి వచ్చిందే. అందుకనే కేసీఆర్ కు మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మించాలనే ఆలోచన తట్టడం విశేషం.