cinema : ఒకవైపు చదువుతూనే మరోవైపు ఎదో ఒక వృత్తిని ఎంచుకుంటారు. కొందరు వ్యాపార రంగంలోకి వెళుతారు. మరి కొందరు చదువుకు తగిన వృత్తిని ఎంపిక చేసుకుంటారు. చదువు పూర్తయిన తరువాత ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధం అవుతారు. కానీ సినీ పరిశ్రమకు కూడా విద్యావంతులు వచ్చిన హీరోయిన్ లు కూడా ఉన్నారు. డిగ్రీ, ఆపైన చదువుకొని సినీ పరిశ్రమలో వచ్చిన అందాల భామలు కూడా ఉన్నారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం….
తెలుగు చిత్ర పరిశ్రమలో తీరిక లేకుండా నటిస్తున్న రష్మిక అత్యధిక విద్యావంతురాలు. ఈ అందాల ముద్దుగుమ్మ బెంగుళూర్ లోని ఎం.ఎస్. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ నుండి సైకాలజీ చదివారు. ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. వాటి తరువాత జర్నలిజంన కూడా చదివారు.
సాయి పల్లవి డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యింది. కోయంబత్తూర్ లో ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. ఆ తరువాత జార్జియాలో వైద్య విద్యను పూర్తి చేసింది. సినిమాలో నటించాలనే కోరికతో వైద్య వృత్తిని చేపట్టకుండా నటన రంగంలో అడుగుపెట్టింది.
తెలుగు చిత్ర పరిశ్రమ హీరోయిన్ లలో అత్యధిక విద్యావంతులల్లో ఈ ఇద్దరే అందాల ముద్దుగుమ్మలు ఉండటం విశేషం