Salt water : ఉదయం పరిగడుపున మామూలు నీళ్లు తాగుతాం. కానీ ఉప్పు నీళ్లు తాగితే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. చాలా మందికి తెలియక వట్టి నీరే తాగుతారు. ఉప్పు నీరు తాగడం వలన శరీరం ఎంతో ఆరోగ్యముగా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలు వస్తాయి. అతిగా తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పరిగడుపున ఉప్పునీరు తాగితే మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగుతుంది. జలుబు, దగ్గు మొదలైన ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. అధిక బరువు సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. చుండ్రును తొలగిస్తుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. మూత్రపిండాలు,కాలేయం, ఆరోగ్యంగా ఉంటాయి. అధిక బరువు సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఉప్పు నీరు శరీరానికి అవసరమైన ఖనిజాలను అందిస్తుంది.
జీర్ణవ్యవస్థలోని యాసిడ్ బ్యాలెన్స్ అవుతాయి. మొటిమలు, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది
ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగడం వల్ల అనేక వ్యాధులకు ఇది దివ్యౌషధంలా పని చేస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. రోజంతా శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఇందులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఉప్పునీరు ప్రభావవంతంగా
పనిచేస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.