Rasmika : ప్రముఖ సినీ నటి రష్మిక మందన్నా ప్రస్తుతం ఫుల్ జోష్ మీదుంది. పుష్ప 2తో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. తీరిక లేకుండా సినీ ప్రపంచంలో గడుపుతున్న ఆమె ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ లో తన కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పడం విశేషం.
తనను పెళ్లి చేసుకోబోయే భర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు రష్మిక ఇంటర్వ్యూ కామెంట్స్ సోషల్ మీడియా లో వైరలవుతున్నాయి. జీవితంలోని కష్టసమయంలో నాకు సపోర్ట్ చేయాలి. మంచి మనసు ఉండాలి. అన్ని వేళలా నాకు భద్రతనివ్వాలి. నాపై శ్రద్ధ వహించాలి. ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. ఒకరిపై ఒకరు బాధ్యతగా నిలవాలి. నా జీవితంలో ప్రతీ దశలోనూ తోడుండాలి.
.
తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనం ఉండదు. మన ఒడిదుడుకుల్లో మనతో ఉండి అండగా నిలవాలి. నా దృష్టిలో ప్రేమలో ఉండడం అంటే భాగస్వామిని కలిగి ఉండడమే.. అంటూ తన కాబోయే భర్త గురించి చెప్పడం విశేషం.