Moon&Holy : 2025 నూతన సంవత్సరంలో చంద్ర గ్రహణం రాబోతోంది. అదే రోజు హోలీ పండుగ కూడా వస్తుంది. కానీ గ్రహణం రోజు ఎలాంటి పనులు చేయాలి. ఎలాంటి పనులు చేయరాదు అనే విషయాలను వేద పండితులు ఇలా చెబుతున్నారు. చంద్ర గ్రహణం 2025 లో ఈరోజు వస్తుంది. ఆరోజు మన దేశంలో ఏ ప్రాంతంలో కనబడుతోంది అనే విషయాన్నీ కూడా తెలుసుకుందాం.
జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 లో మొదటి చంద్ర గ్రహణం ఫాల్గుణ మాసం పౌర్ణమి తిధి మార్చి 14 న రోజున ఏర్పడనుంది. అదే రోజు హోలీ పండుగ కూడా రావడం విశేషం. ఇటువంటి పవిత్రమైన రోజు నూతన సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణంకు సూత కాలం ఉండదు. గ్రహణం ఏర్పడినప్పుడే సూత కాలాన్ని పాటిస్తారు.
2025 మార్చ్ 14న ఉదయం 9:29 గంటల నుంచి మధ్యాహ్నం 3:29 గంటల వరకు చంద్ర గ్రహణం ఏర్పడనుందని జ్యోతిష్యం లో చెప్పబడింది. పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, యూరప్, దక్షిణ అమెరికా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ ఉత్తర ధ్రువంలో చంద్ర గ్రహణం కనిపిస్తుంది. భారత దేశంలో మాత్రం కనిపించడం లేదు.