Home » IFTU : రవాణా రంగం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి….IFTU డిమాండ్

IFTU : రవాణా రంగం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి….IFTU డిమాండ్

IFTU : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగం కార్మికుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల ఆటో & మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ (TPAMF -IFTU) పెద్దపల్లి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ నరేష్ డిమాండ్ చేశారు. గోదావరిఖనిలో రవాణా రంగం కార్మికులతో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నరేష్ మాట్లాడారు. ఈ సందర్బంగా నరేష్ మాట్లాడుతూ డిసెంబర్ 7న తమ హక్కుల సాధన కోసం రవాణా రంగం కార్మికులు సమ్మెలో పాల్గొనాల్సిందిగా కోరారు.

రవాణా రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లకు ఉద్యోగ భద్రత, ఉపాధి గ్యారెంటీ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగ కార్మికుల సమస్యల పరిష్కరించేవరకు ఆటోల క్యాబ్ డ్రైవర్ కార్మికులు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా సమయంలో డ్రైవర్లు ఆర్థిక ఇబందుల్లో ఇరుక్కొని నేటికీ సైతం కోలుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రుణంతో వాహనాలను కొనుగోలు చేసిన వారిని సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక ఆదుకోలేదని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం 2019 లో అమలు చేసిన మోటార్ వాహన చట్టం డ్రైవర్లను మరింత ప్రమాదంలో నెట్టిందన్నారు. రవాణా కార్మికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పని చేస్తున్నారని, వీరికి సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి ₹12,000. ఇస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఐఎఫ్ టీయు జిల్లా నాయకులు మల్యాల దుర్గయ్య, ఎడ్ల రవికుమార్, ఎం కొమరయ్య, ఆటో డ్రైవర్లు మల్లేశం, మేకల సతీష్, సమ్మయ్య ,కే సంపత్,టీ భూమయ్య, ఎం సుధాకర్ రెడ్డి, కే కోటి,బాబు,బాలరాజు, శ్రావణ్, తిరుపతి,సారయ్య, రమేష్.తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *