IFTU DEMAND : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గోదావరిఖనిలో ఐఎఫ్ టియు, ఎఐకెఎంఎస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా ఐఎఫ్ టియు జిల్లా అధ్యక్షులు ఇ నరేష్, ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య లు మాట్లాడుతూ రైతులకు సంబంధించిన మూడు నల్ల చట్టాలు, కార్మికులకు సంబంధించిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దేశంలోని వ్యవసాయ రంగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను ఆధాని, అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టుట కోసమే కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకువచ్చిందని వారు ఆరోపించారు. ఈ చట్టాలను రద్ధు చేసే వరకు దశల వారి పోరాటాలకు సిద్ధం కావాలని వారు ఈ సందర్బంగా రైతులకు, కార్మికులకు పిలుపునిచ్చారు.
ఇలాంటి చట్టాలను అమలు చేయడం వలన దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాలన్ని కూడా కార్పొరేట్ చేతుల్లోకి పోతాయని వారు ఆరోపించారు. రైతాంగం కూడా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కార్మిక,రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే వరకు అన్ని వర్గాల ప్రజలు రుతులకు, కార్మికవర్గానికి అండగా నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఎం దుర్గయ్య, ఎడ్ల రవికుమార్, పైడిపల్లి రమేష్, ఎం కొమురయ్య, ఐ సాంబయ్య, కే మల్లేశం, ఈ సతీష్, ఎండి పాషా, డి కృష్ణారెడ్డి, గుండు రాజయ్య, గురుదత్త సాయి, ఎన్ బాలకృష్ణ, కాసర్ల మల్లేష్, సదయ్య, జనార్ధన్, ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.