VS Reddy : మా పార్టీ లోకి మిమ్మల్ని తీసుకుంటాం అని ఎవరు అనలేదు. రమ్మని కూడా ఏ పార్టీ వాళ్ళు పిలువలేదు. ఆయనను చేర్చుకునే ఉద్దేశ్యం కూడా ఎవరికీ లేదు. ఒకవేళ ఆయనని వైసీపీ వెళ్లగొడితే ఏ పార్టీ వాళ్ళు అయినా చేర్చుకుంటారు అంటే అది కూడా నమ్మకం లేదు. తెలుగు దేశం పార్టీ కి ఆయనంటేనే గిట్టదు. బీజేపీ ఆయనను చూస్తేనే బగ్గుమంటది. ఇకపోతే జనసేన అయితే ఎక్కడో చూసినట్టు ఉంది అన్నట్టుగానే ముఖం మీద గుద్దినట్టు చెప్పేస్తుంది. ఒకవేళ విధిలేని పరిస్థితుల్లో ఆయన చేరినా షోకేస్ లో బొమ్మలా ఉండాల్సిందే. ఎందుకంటే ఆయన ఉంటున్న గల్లీలో కూడా ఆయన చెబితే ఓటువేసి వారు కూడా లేరు.
ఆయన మనసులో ఏముందో ఏమో తెలియదు. కానీ ఎందుకు తొందర పడ్డారో అసలే తెలియదు. మనసులో ఉన్న విషయాన్నీ నిర్మొహమాటంగా చెప్పేశారు. నేను వైసీపీ ని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేస్తూ వైఎస్ జగన్ నమ్మిన బంటు విజయసాయి రెడ్డి ఓ ట్విట్ పెట్టేశారు. వాస్తవానికి అయన తెరవెనుక ఉండి చక్రం తిప్పడానికే పనికొస్తారనే విషయం అందరికి తెలుసు. సూట్ కేసులున్న కంపెనీలకే సూటబుల్ వ్యక్తి అని కూడా చాలా మందికి ఏపీలో తెలుసు.
విజయ సాయి రెడ్డి రాజకీయ చాణక్యం కేవలం ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి మాత్రమే అవసరం ఉంటుంది. ఇతర పార్టీల వారు ఎవ్వరు కూడా ఆయన నైపుణ్యాన్ని అంగీకరించరు. ఒకవేళ ఆయన జగన్ కు దూరమైతే మాత్రం ఎందుకూ పనికిరారు అని కూడా అంటారు కొందరు. విధిలేని పరిస్థితుల్లో జగన్ పై నమోదయిన కేసుల్లో అప్రూవర్ గా మారితే మాత్రం ఎదో ఒక పార్టీలో కూర్చోడానికి సీట్ దొరికే అవకాశం అయితే ఉంది.
మాజీ సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల పరిపాలన కాలంలో జరిగిన ఆర్థిక లావాదేవీల్లో విజయసాయి రెడ్డి గణాంకాలు బాగానే ఉన్నాయనే ప్రచారం కూడా ఏపీలో ఉంది. వైసీపీ లో ఉండటం ఇష్టం లేకపోయినా, జగన్ పై కోపంతోనో బయటకు వచ్చిన నేపథ్యంలో ఎవరు కూడా నమ్మరు. ఆయనను నమ్మాలంటే జగన్ కేసుల్లో అప్రూవర్ గా ముందు మారాలి. జగన్ పై నమోదయిన కేసులకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలి. అప్పుడే కొంతవరకు నమ్మే పరిస్థితి ఏర్పడుతుంది. అంతే కానీ ఎవరు అడగకపోయినా నేను వైఎస్సార్ సీపీ ని వదిలిపెట్టడం లేదని చెబితే కొత్తగా ఈ రోజు ఖద్దరు చొక్కా వేసుకున్న ఏ పార్టీ కార్యకర్త కూడా నమ్మే పరిస్థితి ఏపీ లో లేదు.