Good Job : తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు సువర్ణ అవకాశం. మంచి భవిష్యత్తు. రాజకీయ నాయకులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పడుతాయి. మండలంలోని ఎమ్మార్వో, ఎంపీడీఓ తో పాటు కలెక్టర్ వరకు కూడా పరిచయాలు పెంచుకునే అవకాశం ఉంటుంది. నిత్యం ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి. ప్రజలకు సేవ చేసే అవకాశం. మరోవైపు ప్రభుత్వ భాద్యతలు. పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళలకు ఇంతకంటే ఇంకా ఏమి కావాలి. అందుకే ప్రభుత్వ ప్రకటన రాగానే దరఖాస్తు చేసుకోండి.
పదోతరగతి ఉత్తీర్ణులైన నిరుద్యోగ మహిళలకు ప్రభుత్వం మంచి అవకాశం ఇవ్వబోతోంది. రాష్ట్రంలో 1629 ఖాళీలు ఉన్నవి. వాటన్నిటిని భర్తీ చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు రాష్ట్ర మంత్రి ఆదేశాలు కూడా జారీ చేశారు. జిల్లా, మండలాల వారీగా ఖాళీలను ప్రకటిస్తారు. నియామకానికి ముందుగా ప్రవేశ పరీక్ష ఉంటుంది. జిల్లా సమాచారంతో పాటు తూనికలు, కొలతలకు సంబందించిన ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి వెంటనే రేషన్ డీలర్ గా నియమిస్తారు.
దరఖాస్తు చేసుకోడానికి పదోతరగతి అర్హత సరిపోతుంది. పద్దెనిమిది ఏళ్ళు నిండి ఉండాలి. నలబై ఏళ్ల వయసు దాటరాదు కేవలం ఈ అవకాశం మహిళలకు మాత్రమే. కేవలం నెలలో పదిహేను రోజులు మాత్రమే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతినెల ఒకటో తేదీ నుంచి పదిహేను తారీకు వరకు రేషన్ డీలర్ గా భాద్యతలు నిర్వహించాలి.