Home » goodnews : రాష్ట్ర మహిళలకు మరో గుడ్ న్యూస్ ప్రకటించిన ప్రభుత్వం

goodnews : రాష్ట్ర మహిళలకు మరో గుడ్ న్యూస్ ప్రకటించిన ప్రభుత్వం

goodnews : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గొప్ప శుభవార్త ప్రకటించింది. మహిళా సంఘాలకు ఇప్పటికే సోలార్ విద్యుత్ తయారీ, ఆర్టీసీ లో బస్సులు, విద్యార్థుల డ్రెస్ కుట్టడం, పెట్రోల్ బంక్ ల ఏర్పాటు చేస్తూ వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దుతోంది. తాజాగా మరో కొత్త పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్టుగా ప్రకటించింది.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో మధ్యాహ్న భోజనం విద్యార్థులకు ఏర్పాటు చేస్తోంది. అదే విదంగా ప్రభుత్వ హాస్టల్ లో కూడా ఉదయం అల్ఫాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం అందిస్తుంది. భోజనం సరుకులు గత కొన్నేళ్లుగా టెండర్ ద్వారా గుర్తింపు పొందిన కాంట్రాక్టర్ సరఫరా చేసేది. వాళ్ళు చేసిన సరుకులు నాణ్యత లోపం ఉండేది. నాణ్యత లేని కారణంగా విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. దింతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో భోజనం సరుకులు సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కాంట్రాక్ట్ పద్దతిలో సరుకులు సరఫరా చేసే విధానాన్ని పూర్తిగా రద్దు చేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మహిళా సంఘాలు భోజనం సరుకులు సరఫరా చేసే విధంగా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం, హాస్టల్ లో భోజనం సరుకులు మహిళా సంఘాలు సరఫరా చేయడానికి నిర్ణయం తీసుకోండి. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలకు ఏడాదిపాటు ఉపాధి లభించనుంది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *