Home » Hundi : తిరుమల ఆదాయం ఎంత పెరిగిందంటే ?

Hundi : తిరుమల ఆదాయం ఎంత పెరిగిందంటే ?

Hundi : తిరుమల, తిరుపతి ఏడు కొండల శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకోడానికి భక్తులు తండోప, తండాలుగా తరలివస్తారు. దేశంలోని చాలా ప్రాంతాల నుంచి వచ్చి తమ మొక్కులు చెల్లిస్తారు. కోరిన కోరికలు తీరడంతో మొక్కిన విదంగా వెంకన్న స్వామికి వివిధ రూపాల్లో కానుకలు చెల్లిస్తారు.

ప్రతిరోజూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోడానికి 70 వేల నుంచి లక్ష వరకు భక్తులు వస్తుంటారు. వీరందరికి సౌకర్యాలు, వసతి, భోజనం ఏర్పాట్లు చేస్తోంది తిరుమల, తిరుపతి దేవస్థానం బోర్డు. ఇవన్నీ కూడా భక్తులు హుండీ లో వేసే కానుకలతోనే ఏర్పాట్లు చేస్తున్నారు. వీటన్నిటి ఖర్చు కూడా భారీగానే ఉంటుంది.

2024 లో భక్తులు హుండీలో వేసిన కానుకల ద్వారా ఆదాయం 1,365 కోట్ల రూపాయలు దాటిందని అధికార గణాంకాలు చెబుతున్నాయి. సగటున హుండీ ద్వారా ఆదాయం రూ.3.6 కోట్లు. 2024 లో సుమారు 99 లక్షల మంది భక్తులు తల నీలాలు సమర్పించారని అధికార గణాంకాలు చెబుతున్నాయి.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *