స్నేహపూర్వక వాతావరణం మా భాద్యత
శాంతిభద్రతల పరిరక్షణకు మీడియా సహకరించాలి
బీబీపేట ఎస్సై నవీన్ చంద్ర
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
బీబీపేట పోలీస్ స్టేషన్ లో ఎస్సై గా భాద్యతలు చేపట్టిన నవీన్ చంద్రను బీబీపేట మండల్ ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం సభ్యులు పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఎస్సై నవీన్ చంద్ర మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. ప్రజలు పోలీసులకు అన్ని విషయాల్లో సహకరిస్తేనే మరింత సమర్థవంతంగా, చురుకుగా విధులు నిర్వహించగలమని తెలిపారు.
ప్రజల భద్రత, శాంతియుత వాతావరణం కోసం పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా నేరుగా పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలన్నారు. మధ్యవర్తుల అవసరం లేకుండానే ప్రజలకు చట్టం పరిధిలో న్యాయం చేస్తామన్నారు. తప్పు చేసిన వారు ఏ హోదాలో ఉన్నప్పటికి చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. చట్టం పరిధిలో పేదవారికి ఒక న్యాయం, ఉన్నవారికి మరొక న్యాయం ఉండదన్నారు. చట్టానికి ప్రతి ఒక్కరికి కట్టుబడి ఉండాల్సిందేనన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎల్లమైన శ్రీకాంత్ (బతుకమ్మ టీవీ), ఉపాధ్యక్షుడు దేవునిపల్లి తిరుపతి (సాక్ష్యం), కార్యదర్శి ఏంబరి. శ్రీనివాస్ (జనం న్యూస్), కోశాధికారి కారంపూరి వేణు (నవతెలంగాణ), కార్యవర్గ సభ్యులు కొరివి నరసింహులు (తేజ టీవీ), కొమ్మురాజు (తెలంగాణ ఎక్స్‌ప్రెస్) పాల్గొన్నారు.

by