Singareni : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ 69వ వర్ధంతి ని ఘనంగా జరుపుకున్నారు. అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ…..
అంబేద్కర్ అందించిన రాజ్యాంగం నేడు ఎందరినో మేధావులను, ఉన్నత విద్యావంతులను చేసిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అనేక హక్కులను సాధించిపెట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయన అందించిన మౌలిక సూత్రాలను తుంగలో తొక్కడానికి నిరంకుశ పాలన కొనసాగిస్తున్నదని వారు ఆరోపించారు. ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ సమితి కార్యదర్శి ఆడెపు రాజమౌళి, రాష్ట్ర సమితి సభ్యులు బొల్లం పూర్ణిమ, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య, పట్టణ సహకార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్, మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, జిల్లా సమితి సభ్యులు దాసరి శ్రీధర్ ,కొంకుల రాజేష్, రత్నం రాజం, పట్టణ కార్యవర్గ సభ్యులు బొంకూర్ రామచందర్, ఇనుముల రాయమల్లు, కలువల రాయమల్లు తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

by