గని రికార్డులను తనిఖీ చేసిన డీజిఎంఎస్
గని అభివృద్ధికి పలు సూచనలు
కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి) :
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ మందమర్రి ఏరియాలోని కాసిపేట-1 ఇంక్లైన్ గనిని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డీజీఎంఎస్) అధికారులు సందర్శించి గనిలో నిర్వహిస్తున్న భద్రతా చర్యలు, నిర్వహణ విధానాలు, సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం గనిలోని వివిధ పని ప్రదేశాలను తనిఖీ చేసి భద్రతా ప్రమాణాల అమలుపై సమీక్ష నిర్వహించారు.

గనికి చేరుకున్న డీఎంఎస్ (మైనింగ్) సాగేష్ కుమార్, డీడీఎంఎస్ (మైనింగ్) దీపక్ కుమార్‌లకు ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ, కెకె గ్రూప్ ఏజెంట్ అబ్దుల్ ఖాదీర్, గని మేనేజర్ సతీష్ తో పాటు ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారిని ఘనంగ సన్మానించారు. పర్యటన సందర్భంగా అధికారులు గని నిర్వహణకు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించి, భూగర్భంలోని పని ప్రదేశాలను సందర్శించారు. భద్రతా నిబంధనల అమలు, కార్మికుల రక్షణ చర్యలు, గని నిర్వహణ ప్రమాణాలపై అధికారులతో చర్చించారు.

ఈ పర్యటనలో డీఎంఎస్ (మైనింగ్) సాగేష్ కుమార్, డీడీఎంఎస్ (మైనింగ్) దీపక్ కుమార్ నేతృత్వంలోని బృందంతో పాటు ఏరియా జీఎం రాధాకృష్ణ, బెల్లంపల్లి రీజియన్ జీఎం (సేఫ్టీ) రఘు కుమార్, కెకె గ్రూప్ ఏజెంట్ అబ్దుల్ ఖాదీర్, మేనేజర్ సతీష్, ఏరియా ఇంజనీర్ మాధవ్, రక్షణ అధికారి సురేష్, డిప్యూటీ మేనేజర్ వెంకటేష్, ఇంజనీర్ శ్రీనివాస్, సర్వేయర్లు ప్రభాకర్, రవీందర్, సంక్షేమ అధికారి మీర్జా గౌస్ జీషాన్, వర్క్‌మెన్ ఇన్స్పెక్టర్లు రంజిత్, అశోక్, గణేష్ తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

by