Home » IFTU : కార్పొరేట్ శక్తులకే బీజేపీ మద్దతు

IFTU : కార్పొరేట్ శక్తులకే బీజేపీ మద్దతు

IFTU : దేశంలోని కార్పొరేట్ శక్తులకే కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ పార్టీ మద్దతు ఉందని IFTU జాతీయ ప్రధాన కార్యదర్శి టీ శ్రీనివాస్ ఆరోపించారు. బీహార్ రాష్ట్రం కేహల్గామ్ లో ఈ నెల 20, 21 తేదీలలో ఐఎఫ్టీయూ జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలను రెండు రోజులపాటు నిర్వహించనున్నారు. మొదటి రోజు సమావేశాలకు హాజరైన శ్రీనివాస్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ…..

కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూల వాతావరణాన్ని ఏర్పర్చడంతోనే కార్మికులకు ఉద్యోగ రక్షణ లేకుండా పోయిందని శ్రీనివాస్ ఈ సందర్బంగా ఆరోపించారు. దేశంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలనీ ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి కనీస వేతనం ముప్ఫయ్ వేల రూపాయలు ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ జనరల్ కౌన్సిల్ లో ఐ ఎఫ్ టీ యు జాతీయ ఉపాధ్యక్షులు పీ ప్రసాద్, సాదినేని వెంకటేశ్వరరావు, పుల్వెందర్ సింగ్, ఎం వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు ఏ వెంకన్న ఈ నరేష్ ల తోపాటు 250 మంది డెలిగేషన్ పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *