Home » CPM : పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ: 50 వేల పరిహారం చెల్లించాలి

CPM : పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ: 50 వేల పరిహారం చెల్లించాలి

CPM : తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతుకు ఒక ఎకరానికి రూ:50 వేల చొప్పున నష్ట పరిహారాన్ని ఇవ్వాలని సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చెన్నూరులో నిర్వహించిన మండల స్థాయి పార్టీ సమావేశంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులు అప్పు చేసి పంటలు వేయగా తుఫాన్ కారణంగా నష్టపోయి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. వరి, మిరప, పత్తి, పసుపు, జొన్న, కంది తదితర పంటలు వేసిన రైతులు అకాల వర్షాలతో నష్టపోవడం జరిగిందన్నారు.

చేతికందిన పంట కళ్ళముందే వరదల్లో కొట్టుకుపోయి ఆర్థికంగా నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆదుకోవాలని సంకె రవి డిమాండ్ చేశారు. నేలను నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకునే రైతులు నేడు అప్పుల పాలై ఆవేదనలో ఉన్నారన్నారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే ఎకరానికి రూ : 50 వేలు మంజూరు చేసి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

పంట నష్ట పోయిన రైతులను ఆదుకోని నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పార్టీ చేపట్టే ఆందోళనలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి కరీంభీ అధ్యక్షత వహించగా, మండల కార్యదర్శి బొడెంకి చందుతో పాటు దాసరి రాజేశ్వరి, సామల ఉమారాణి, సిడం సమ్మక్క, దరపు చంద్రన్న, బండారి రాజేశ్వరి, తుమ్మ రేణుక, అనసూర్య , కార్యకర్తలు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *