Home » Congress : పౌరసరఫరాల సంస్థ చైర్మన్ గా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్

Congress : పౌరసరఫరాల సంస్థ చైర్మన్ గా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్

Congress : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నది. పార్టీలో రాజకీయ ఓనమాలు దిద్ది గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన నాయకులు జిల్లాలో ఎందరో పార్టీ మారిన సందర్భాలు సైతం ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో సైతం పదవుల కోసం పలువురు పార్టీ మారిన సందర్భాలు సైతం ఉన్నవి. పార్టీని నమ్ముకొని జెండా నీడన కొనసాగిన వారిలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఒకరు. పార్టీ లో కొనసాగుతున్న సమయంలో ఆయనకు ఇతర పార్టీల నుంచి అవకాశాలు కూడా రావడం జరిగింది. వాటన్నిటిని పక్కకు పెట్టేసి శ్వాస ఉన్నంత వరకు కాంగ్రెస్ జెండా మోస్తాను, కానీ పార్టీ మారే ప్రసక్తి లేదని తన అనుచరుల వద్ద స్పష్టం చేసిన సందర్భాలు సైతం ఉన్నవి. పదవి కోసం పార్టీ మారను, కానీ ఆ పదవి కోసం పెద్దల వద్ద స్వరం పెంచిన సందర్భాలు సైతం ఉన్నవి.

కష్టకాలంలో పార్టీని ఆదుకొన్నందుకు ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం మంత్రి పదవి ఖాయమనుకున్నారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్. ప్రభుత్వం ఏర్పడిన రోజు మంత్రి పదవి దక్కలేదు. రెండో దఫా కూడా ఆయన ఆశలు అడియాశలే అయ్యాయి. పలు రాజకీయ సమీకరణాల నేపథ్యంలోమంత్రి పదవి దూరమైనది. ఎట్టకేలకు ఆయనను పౌరసరఫరాల సంస్థ చైర్మన్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేయడం విశేషం. ఈ పదవి కేబినెట్ పదవితో సమానం.

మంత్రి పదవి దక్కితే మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ ఆశించారు. ఒకవైపు మంత్రి పదవి కోసం ఆయన తనదయిన శైలిలో ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు అభివృద్ధి కోసం తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అన్ని సౌకర్యాలతో మహా ప్రస్థానం పూర్తి చేశారు. రెండు, మూడు రోజులకోసారి వచ్చే తాగునీటి వ్యవస్థ లోపాలను సరిదిద్దారు. సకల సౌకర్యాలతో ఉండే విధంగా మంచిర్యాల లో ఆసుపత్రి నిర్మాణం కొనసాగుతోంది. లక్సెట్టిపేట లో నూతన ఆసుపత్రి, పాఠశాల, కళాశాల నిర్మాణంను ఏడాదిలోపు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనారోగ్యం నియోజకవర్గం అభివృద్ధికి కొంత ఆటంకంగా మారింది. చైర్మన్ గా ఆదేశాలు రావడంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *