కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
కేపీ రాజారెడ్డి జనసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో, కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి తమ సొంత నిధులతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డ్యూయల్ డెస్క్‌ల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం బీబీపేట్ మండలంలోని బీబీపేట్ పట్టణం, తుజాల్‌పూర్, శేరి బీబీపేట్ గ్రామాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు డ్యూయల్ డెస్క్‌లు అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి గౌరవంగా కూర్చొని చదివే అవకాశం కల్పించడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలలను మెరుగైన మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించారు.

by