కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
కామారెడ్డి జిల్లా బీబీపేట్ గ్రామంలోని 77వ బూత్ పరిధిలో ప్రత్యేక ఇంటింటి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి SIR అప్లికేషన్ ఫారాలను పంపిణీ చేస్తూ, ఓటర్ల జాబితా క్రమబద్ధీకరణ (సవరణ) కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న SIR కార్యక్రమం గురించి ప్రజలకు పూర్తి వివరాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మాజీ మండల కో-ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ ఆసిఫ్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకుని, అవసరమైన సవరణలు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం SIR కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, దరఖాస్తు ప్రక్రియపై వివరాలు అందించారు.
ఈ కార్యక్రమంలో BLO వడ్నాల రవి, అంగన్వాడీ టీచర్ శ్వేతతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

by