Home » ఏ ఉత్తదే…కొట్లాడుకోలే …

ఏ ఉత్తదే…కొట్లాడుకోలే …

కొట్టుకున్న కాంగ్రెస్ శ్రేణులు
పార్టీ వ్యవహారాలపై సీనియర్ల అసంతృప్తి
రచ్చకెక్కిన మందమర్రిలో గ్రూప్ లు
అంత వట్టిదే అంటున్న పట్టణ అధ్యక్షుడు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో క్రమశిక్షణ లోపించిందా ? అంటే అవునంటున్నారు పలువురు సీనియర్ నేతలు. అంతే కాదు గ్రూపు లు కూడా పెరగడం కూడా పార్టీకి నష్టం చేకూరుతున్నదంటున్నారు పలువురు కాంగ్రెస్ శ్రేణులు. ఈ నెల 22 న మందమర్రిలో జరిగిన సంఘటననే ఇందుకు తార్కాణమంటున్నారు. మందమర్రి మార్కెట్లోని పట్టణ అధ్యక్షుడి కళ్లెదుటే కొట్టుకోవడంతో పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత విషయం కొట్టుకునే వరకు వెళ్లిందంటే పరిస్థితి ఎలా ఉందొ చెప్పాల్సిన అవసరం కూడా లేదంటున్నారు. సంఘటన వివరాలు కాంగ్రెస్ శ్రేణులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి…..

యూత్ కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పై మందమర్రి పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో ఉన్న పేర్లను తొలగించి ఒక యూత్ కాంగ్రెస్ నాయకుడు తన వ్యక్తిగత స్టేటస్ లో పోస్ట్ చేసాడు. దీన్ని మరొక నాయకుడు పేర్లు తొలగించిన విషయాన్నీ ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య ఫోన్ లో వాగ్వివాదం జరిగింది. ఈ గొడవ చివరకు పట్టణ అధ్యక్షుడు మంద తిరుమల్ వద్దకు బుధవారం రాత్రి చేరింది. ఇరువర్గాలను పిలిచి నచ్చజెప్పడానికి ఆయన ప్రయత్నించాడు. అయినప్పటికీ ఆ ఇద్దరు నాయకులు అధ్యక్షుడి ఎదుటే కొట్టుకున్నారు. ఇద్దరిలో ఒకరికి తీవ్ర గాయమైనట్టు సమాచారం.

గత నాలుగు నెలల నుంచి పట్టణంలోని కొందరు నాయకులు మాత్రమే మంత్రి వివేక్ కార్యక్రమంలోనే పాల్గొంటున్నారు. పార్టీ పరంగా పట్టణ, జిల్లా కమిటీ మందమర్రిలో ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పలువురు సీనియర్ నేతలు పాల్గొనడం లేదు. ఇందుకు ప్రధాన కారణం పట్టణంలో ఎవరికీ వారే అనే రీతిలో గ్రూప్ లుగా ఏర్పడటమే కారణమంటున్నారు. కష్టకాలంలో కూడా పార్టీని నమ్ముకున్న వారికి పార్టీ, ప్రభుత్వ పరంగా ఎలాంటి పదవులు రాలేదు. ఆ అసంతృప్తితో ఉన్నవారే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి.

యూత్ కాంగ్రెస్ నేతలు కొట్టుకున్న విషయాన్ని పట్టణ అధ్యక్షుడు మంద తిరుమల్ ను వివరణ కోరగా ” ఏ అంత ఉత్తదే..ఎవరు కొట్టుకోలేదు… ఇద్దరినీ పిలిచి మాట్లాడి పంపించిన” అంటూ వివరించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *