కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
బీబీపేట మండలంలోని అంగన్‌వాడీ కేంద్రంలో పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించే కార్యక్రమాన్ని సంబంధిత శాఖ అధికారులు, ఉద్యోగులు, స్థానిక నాయకులు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 10వ వార్డు సభ్యుడు మొహమ్మద్ ఆసిఫ్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. పిల్లల ఆరోగ్యవంతమైన, బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ శ్వేత, ఆశా వర్కర్ లక్ష్మి, చిన్నారుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు .

by