Home » Rasmika : రష్మిక అభిమానులకు బ్యాడ్ న్యూస్

Rasmika : రష్మిక అభిమానులకు బ్యాడ్ న్యూస్

Rasmika : ప్రముఖ సినీ నటి రష్మిక పుష్ప-1, పుష్ప -2 సినిమాలతో బోలెడంత అభిమానులను సంపాదించుకొంది. పలు భాషల్లో నటిస్తూ తీరిక లేకుండా నటిస్తోంది. ఎప్పుడు కూడా తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తన సమాచారాన్ని చేరవేస్తుంది. అభిమానుల ఆశయాలకు అనుగుణంగా సినిమా కథలను ఎంపిక చేసుకుంటోంది. తన కెరీర్ ఎక్కడ కూడా దెబ్బతినకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది రష్మిక.

తన ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోడానికి నిత్యం రష్మిక జిమ్ చేస్తుంది. జిమ్ కూడా తన ఇంటిలోనే ఏర్పాటు చేసుకొంది. తన కెరీర్ కోసం జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రష్మిక తన అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిమ్ చేస్తున్న సమయంలో స్వల్ప గాయాలయ్యాయని చిత్ర వర్గాల సమాచారం.

దింతో కొద్ధి రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే గాయాలు నయమవుతాయని ఆమె ప్రత్యేక వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. రష్మిక ప్రస్తుత పరిస్థితుల్లో విశ్రాంతి తీసుకోవడంతో ఆమె నటిస్తున్న సినిమా షూటింగ్ లకు విరామం ఏర్పడింది. ఆమె కోలుకున్న తరువాతనే సినిమా షూటింగ్ వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *