Home » ప్రభాస్ కల్కి సినిమాకు ఎన్నికల గ్రహణం

ప్రభాస్ కల్కి సినిమాకు ఎన్నికల గ్రహణం

xr:d:DAGBRDuLR64:98,j:8464939949662489443,t:24041016

వాయిదా పడిన విడుదల
కోల్ బెల్ట్ న్యూస్:హైదరాబాద్
ప్రభాస్ సినిమా వస్తోందంటే అయన అభిమానులకు తగిన విదంగా ఉంటుందనే ప్రచారం సినీ ఇండస్ట్రీలో ఉంది.ప్రభాస్ తో ఏ సినిమా తీసిన కొత్త ధనం ఉట్టిపడుతుంది. పోరాటాలు,సన్నివేశాలు ఏవైనా సరే ప్రత్యేకంగానే ఉంటాయి.అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ” కల్కి 2898 ED ” సినిమా విడుదలకు ఎన్నికల రాజకీయ గ్రహణం పట్టుకుంది. మే 9న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల చేయడానికి దర్శక,నిర్మాతలు సన్నాహాలు చేపట్టారు. ఎట్టకేలకు సినిమాను విడుదల చేయడానికి వాయిదా వేశారు. ఇండియాలో ఎన్నికల వాతావరణం ఉన్న నేపథ్యంలో సినిమాను వీడుదల చేస్తే లక్ష్యం చేరుకోలేమనే భావనతో సినియూనిట్ ఉన్నట్టు సమాచారం.దాదాపుగా కల్కి సినిమాను మే చివరి వారంలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానరుపై నిర్మిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ సరసన ప్రముఖ బాలీవుడ్ అందాల భామ దీపికా పదుకోనె నటించడం విశేషం. ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.అభిమానులు అంచనాలకు తగ్గట్టుగా సినిమాను నిర్మిస్తున్నారు. నిర్మాత అశ్వినీ దత్ సినిమా తీస్తున్నాడంటే భారీ ఎత్తున ఉంటుందనేది ప్రేక్షకుల నమ్మకం.

 

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *