Home » ఆంధ్ర విద్యాసంస్థలతో తెలంగాణ నేత పాల వ్యాపారం

ఆంధ్ర విద్యాసంస్థలతో తెలంగాణ నేత పాల వ్యాపారం

బిఆర్ఎస్ నేతపై కవిత పరోక్ష ఆరోపణ
దురదృష్టమంటున్న కవిత

కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. రెండు విద్యాసంస్థలతో పాల వ్యాపారం చేస్తున్న ఓ నాయకుడిని ఉద్దేశిస్తూ “గుంటనక్క” అని వ్యాఖ్యానించారు కవిత. అలాంటి వ్యక్తి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో కొనసాగడం ఆ పార్టీ దురదృష్టకరమని విమర్శించారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కవిత ఎవరిని ఉద్దేశించి మాట్లాడారనే అంశంపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన కార్పొరేట్ విద్యాసంస్థలపై ఉద్యమకారులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేయడంతో పాటు పలు విద్యాసంస్థలపై దాడులు కూడా జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల బీఆర్ఎస్‌కు చెందిన ఓ కీలక నాయకుడు ఒక రెండు విద్యాసంస్థలకు పాల సరఫరా చేస్తూ వ్యాపారం నిర్వహిస్తున్నారని కవిత ఆరోపించారు. అయితే, ఆమె ఎవరిపేరును నేరుగా ప్రస్తావించలేదు.

అయితే, కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలను హరీష్ రావును ఉద్దేశించినవేనని తెలంగాణ రక్షణ సేన నాయకులు చెబుతున్నారు. హరీష్ రావు సతీమణి డెయిరీ వ్యాపారం నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఈ ఆరోపణలు వచ్చాయని వారు పేర్కొంటున్నారు.ఇప్పటివరకు ఈ ఆరోపణలపై హరీష్ రావు లేదా ఆయన వర్గం నుంచి అధికారిక స్పందన వెలువడలేదు. ఈ వ్యవహారంపై వారు ఎలా స్పందిస్తారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *