CPM : తెలంగాణ రాష్ట్రానికి యూరియా సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనదని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ళ అషయ్య ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యుద్దాల నేపథ్యంలోనే యూరియ రావడం లేదని కేంద్ర ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగ వ్యవరించడం, మాట్లాడడం సరికాదన్నారు. తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అడ్డగోలుగా మాట్లాడడం పై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మంచిర్యాల జిల్లాలో రైతాంగానికి యూరియ కావలసినంత సరఫరా కాకపోవడం వలన పంటల ఎదుగుదల తగ్గిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక బస్తా యూరియా ఇచ్చి చేతులు దులుపుకోవడం సమంజసం కాదన్నారు. మంచిర్యాల జిల్లాలో కురిసిన భారీ వర్షాల మూలంగా జిల్లా వ్యాప్తంగా పారిశుధ్య సమస్య ఏర్పడి విష జ్వరాలతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారని ఆరోపించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడ వైద్యులను, మందులను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కనికరపు అశోక్, ఏర్మ పున్నం, బొడెంకి చందు, దాగం రాజారాం, దుంపల రంజిత్ కుమార్, మార్మల మల్లీశ్వరి, K.ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

by