Home » Singareni : గనిలో పని ప్రదేశాలను పరిశీలించిన జీఎం

Singareni : గనిలో పని ప్రదేశాలను పరిశీలించిన జీఎం

Singareni : మందమర్రి ఏరియా సింగరేణి కాసిపేట-1 గనిలో పని ప్రదేశాలను ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధా కృష్ణ గురువారం పరిశీలించారు. ఏరియా జీఎం గా భాద్యతలు చేపట్టిన అనంతరం మొదటి సారి గనిలో పని ప్రదేశాలను పరిశీలించారు. గని రోజువారీ ఉత్పత్తి, ఉత్పాదకతలను గని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్మికులు, సూపర్వైజర్లు, అధికారుల పనితీరును సైతం పరిశీలించి పలు సూచనలు చేశారు. రక్షణ కూడిన ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పని విషయంలో తొందరపడకుండా, అలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

తొందరపాటు నిర్ణయాలతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, తద్వారా ఉత్పత్తికి నష్టం వాటిల్లుతుందని ఆయన కార్మికులకు, సూపర్ వైజర్లకు సూచించారు. విధులకు వచ్చేటప్పుడు, విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. తాను ఇదే గనిలో విధులు నిర్వహించినప్పుడు కార్మికులు ఐక్యంగా విధులు నిర్వహించి గని అభివృద్ధికి కృషిచేసిన సందర్భాలను మరచిపోలేనన్నారు.

మందమర్రి గ్రూపు ఏజెంట్ డి.రాంబాబు మాట్లాడుతూ సంస్ధ ఇచ్చిన ఉత్పత్తి లక్ష్యం చేరుకోవడానికి ఒక్కరు కృషి చేయాలన్నారు. మేనేజర్ డి.సతీష్ మాట్లాడుతూ కంపెనీ ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాసిపేట సేఫ్టీ అధికారి నిఖిల్ అయ్యర్, డిప్యూటీ మేనేజర్ వెంకటేష్, అండర్ మేనేజర్ హిమాలయ, సంక్షేమాధికారి మీర్జా గౌస్ జీషాన్, సర్వేయర్ ప్రభాకర్, ఖాన్ పాల్గొన్నారు.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *