Singareni : మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సింగరేణి కాసిపేట -1 గని ఆవరణలో సోమవారం క్యాడర్ స్కీమ్ ద్వార పదోన్నతి పొందిన కార్మికులకు పదోన్నతి పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగ గని అధికారులు, కార్మిక సంఘం నాయకులు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ పదోన్నతి పొందిన కార్మికులకు సింగరేణి సంస్థ అభివృద్ధి భాద్యతలు మరింత పెరిగాయన్నారు. వారి అనుభవాలను జూనియర్ కార్మికులతో పంచుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో గని మేనేజర్ సతీష్ ,బెల్లంపల్లి బ్రాంచి సెక్రెటరీ దాగం మల్లేష్, పిట్ సెక్రటరీ మీనుగు లక్ష్మీ నారాయణ, రక్షణ అధికారి నిఖిల్, డిప్యూటీ మేనేజర్ వెంకటేష్, సంక్షేమ అధికారి మీర్జా, అధికారులు , సూపర్ వైజర్లు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

by