Health : సాధారణంగా చాలా మంది ఆకుకూరలు ఇష్టపడుతారు. శరీరానికి కావలసినన్ని పోషకాలు వాటిలో ఉంటాయి. ఆకుకూరల్లో తోటకూర ఒకటి. కానీ ఎర్ర తోటకూర గురించి చాలా మందికి తెలియదు. ఇందులో కూడా శరీరానికి కావలసినన్ని పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం…..
ఎర్ర తోటకూరలో ఐరన్ ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. డయాబెటీస్ ఉన్నవారు ఎర్ర తోట కూర తింటే షుగర్ అదుపులో ఉంటుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. కాల్షియం మెండుగా ఉంటుంది. గుండె పనితీరు మెరుగవుతుంది.
దీనిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి, రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. కంటి చూపు మెరుగవుతుంది. రక్త హీనత సమస్యను నివారిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.