Mlc Kavitha : మాజీ సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాయడంతో విభేదాలు ఒక్కసారిగా గుప్పు మన్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఆమె జాగృతి పేరుతోనే రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలు చేస్తోంది. మా నాయకుడు కేసీఆర్ అంటున్నారు. పార్టీ గౌరవ అధ్యక్షుడు కేటీఆర్ అంటున్నారు. కానీ ఆమె మాత్రం పార్టీ తో సంబంధం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.
ఒంటరిగానే బీసీ ఉద్యమం చేపట్టినా పార్టీ నుంచి ఏ ఒక్క బిఆర్ఎస్ నాయకుడు కూడా ఆమెతో కలిసి రావడానికి ముందుకు రావడంలేదు. తాజాగా ఎమ్మెల్సీ మల్లన్న ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇంత జరుగుతున్నప్పటికీ కవిత కు మద్దతుగా కేసీఆర్ నోరు మెదపలేదు. కనీసం హరీష్ రావు, కేటీఆర్ లు కూడా స్పందించలేదు. బిఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఆమెకు మద్దతుగా ఏ ఒక్కరు రాలేదు. ఈ నేపథ్యంలో ఆమె బిఆర్ఎస్ తో ఎదో ఒకటి తేల్చుకోడానికి సిద్ధమైనట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఆమె భర్త అనిల్ తో కలిసి సోమవారం రాత్రి హైదరాబాద్ లో అత్యంత సన్నిహితులతో సమావేశమైనారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశం మంగళవారం తెల్లవారు జాము వరకు జరిగినట్టు తెలిసింది. ఇంత జరుగుతున్నప్పటికీ తనకు మద్దతుగా పార్టీ రావడం లేదంటూ సమావేశంలో ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఇదే సమావేశంలో పార్టీ నుంచి బయటకు వస్తే ఎలా ఉంటుందనే విషయంపై ఆమె సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. మరోసారి సమావేశమై పార్టీలో కొనసాగే విషయంపై నిర్ణయం తీసుకుందామని అనుచరులవద్ద అన్నట్టు సమాచారం. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ఆమె కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందంటున్నారు ఆమె అనుచరులు

by