Amithab Bhachan : అమితాబ్ బచ్చన్ అసలు పేరు అమితాబ్ బచ్చన్ శ్రీవాస్తవ. హిందీ సినిమా నటుడు. భారతీయ సినిమా చరిత్రలో ఆయనను తరచుగా గొప్ప, అత్యంత నిష్ణాతులైన మరియు వాణిజ్యపరంగా విజయవంతమైన నటులలో ఒకరిగా గుర్తిస్తారు. ఐదు దశాబ్దాలకు పైగా తన సినీ జీవితంలో, ఆయన 200 కి పైగా చిత్రాలలో నటించారు.
హిందీ చిత్ర పరిశ్రమకు అయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 1984లో పద్మశ్రీ , 2001లో పద్మభూషణ్ , 2015లో పద్మవిభూషణ్ బిరుదులతో సత్కరించింది. కళారంగానికి ఆయన చేసిన సేవలకు గాను 2018లో అత్యున్నత చలనచిత్ర పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఫ్రాన్స్ ప్రభుత్వం 2007లో తన అత్యున్నత పౌర గౌరవం, ఆఫీసర్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్‌తో సత్కరించడం విశేషం.