Actor Naani : ప్రముఖ హీరో నాని నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో అయ్యాడు. వరుసగా సినిమాల్లో నటిస్తూ తీరిక లేకుండా ఉన్నారు. నాని సినిమాలను తెలుగు చిత్ర పరిశ్రమలో అందరూ మెచ్చుకుంటారు.ప్రస్తుతం ఉన్న నటులు చిత్ర పరిశ్రమలోకి రాక ముందు ఏదో ఒక వృత్తిని ఎంచుకున్నారు. ఆ తరువాత సినిమా రంగంలోకి అడుగుపెట్టిన వారు ఉన్నారు. పరిశ్రమలో ఎదిగిన వారు ఉన్నారు. పోటీ తట్టుకోలేక ఇంటిదారి పట్టిన వారు ఉన్నారు. అయితే చిత్ర పరిశ్రమలోకి రాక ముందు నటుడు నాని ఏమి చేసేవాడో చాలా మందికి తెలియదు.
తెలుగు చిత్ర పరిశ్రమలో అష్టా చెమ్మ సినిమాతో ప్రేక్షకులకు నాని హీరోగా పరిచయం అయ్యాడు. ఆరంభంలోనే నాని హిట్ అందుకున్నాడు. ఆ తరువాత వచ్చిన ఈగ సినిమాతో మరింత ఎదిగిపోయాడు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు నటుడు నాని. ఇటీవల చిరంజీవి సినిమాకు కూడా కొంత పెట్టుబడి పెట్టినట్టుగా చిత్ర పరిశ్రమలో చెప్పుకుంటున్నారు.
నాని హీరో గా నటించడానికి ముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు సినిమాలకు పనిచేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేయడంలో ఏమైనదో ఏమో కానీ ఆ వృత్తిని మధ్యంతరంగానే వదిలేశాడు. నటుడిగా అష్టా చెమ్మ సినిమాతో హీరోగా నటించడం కలిసివచ్చింది. ఇప్పడు హీరో గా అభిమానులను మెప్పిస్తూనే మరోవైపు నాని నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు.