Dill Raju : ప్రముఖ చిత్ర పరిశ్రమ నిర్మాత దిల్ రాజు ఇంటిలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు నాలుగు రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. ఆయన ఇంటితో పాటు సోదరుని ఇంటిలో కూడా అధికారులు తనికీలు చేపట్టారు. అనంతరం ఆయన ప్రత్యేక కార్యాలయం లో కూడా తనికీలు నిర్వహించారు. దిల్ రాజు ఇంటిలో తనికీలు చేపట్టిన విషయం తెలుగు చిత్ర పరిశ్రమలో ఆందోళన కలిగించింది.
దిల్ రాజు ఇంటిలో తనిఖీలు మొదలైన నాటి నుంచి ముఖ్యంగా సోషల్ మీడియా లో రకరకాల పుకార్లు చక్కర్లు కొట్టాయి. దీనిపై దిల్ రాజు శనివారం మీడియా ముందు స్పందించారు. తన ఇంటిలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనికీలు చేపట్టిన విషయాన్నీ మీడియా ముందు వెల్లడించారు.
ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనికీలు చేపట్టిన సందర్బంగ రూ : 20 లక్షలు అధికారులకు లభించాయని వెల్లడించారు. తన ఆదాయానికి సంబంధించిన లెక్కలు అన్ని సవ్యంగానే ఉన్నాయని అధికారులు తెలిపారని దిల్ రాజు తెలిపారు. ఫిబ్రవరి మూడో తేదీన మరోసారి విచారణకు రావాల్సిందిగా కోరుతూ అధికారులు నోటీసు ఇచ్చారని దిల్ రాజు తెలిపారు.