Home » IFTU : 18న కొత్తగూడెంలో విలీనం సభ

IFTU : 18న కొత్తగూడెంలో విలీనం సభ

IFTU : భారత దేశంలో విప్లవ కార్మికోద్యమాన్ని మరింత బలోపేతం చేయాలనే సదుద్దేశ్యంతో విప్లవ కార్మిక సంఘాలు విలీనం కాబోతున్నాయని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, రాష్ట్ర నాయకులు ఈదునూరి రామకృష్ణ. అన్నారు. వారు గోదావరిఖనిలో విలీనం సభకు సంభందించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్బంగ వారు మాట్లాడుతూ

దేశంలోని కార్మిక వర్గం అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నదన్నారు. కార్మిక వర్గం చేస్తున్న పోరాటాలను ప్రభుత్వాలు నీరుగారుస్తున్నాయన్నారు. కార్మిక వర్గం సమస్యలు అనేకం అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని వారు ఆరోపించారు. ప్రభుత్వ విధానాలను తిప్పికొడుతూ, ఎదుర్కొని సమస్యలను పరిష్కరించడానికి విప్లవ కార్మిక సంఘాలు ఏకమవుతున్నాయన్నారు.

కొత్తగూడెంలో ఈ నెల 18 న విలీన సభను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేరోజు సభకు ముందుగా కొత్తగూడెం పట్టణంలో భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమం విజయ వంతం చేయడానికి కార్మిక వర్గాలు అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టీ యు జిల్లా నాయకులు ఈ నరేష్, ఎం దుర్గయ్య, ఈ రాజేందర్, గుండేటి మల్లేశం, కొండ్ర మొగిలి, సిహెచ్ శేఖర్, పీ మొండయ్య, ఎస్ ప్రసాద్, ఐ సాంబయ్య, అన్వేష్, రాజన్న.తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *