Home » Laxmidevi : లక్ష్మీ దేవిని ఏ పూలతో పూజించాలో తెలుసా ?

Laxmidevi : లక్ష్మీ దేవిని ఏ పూలతో పూజించాలో తెలుసా ?

Laxmidevi : లక్ష్మీ దేవిని క్రమం తప్పకుండ ప్రతిరోజూ పూజిస్తారు. ఉదయం, సాయంత్రం కూడా కొందరు పూజిస్తారు. నచ్చిన పూలతో పూజిస్తారు. కానీ ఏ పూలతో పూజిస్తే అమ్మవారు కనికరిస్తారో చాలా మందికి తెలియదు. కానీ వేదంలో ఈ విదంగా చెప్పబడింది.

శుక్రవారం సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. నీటిలో చిన్న గ్లాస్ పాలను కలుపుకొని స్నానం చేయాలి. ఆ తర్వాత లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. శుక్రవారం భార్య,భర్తలు ఇరువురు కూడా ఉపవాసం ఉండటం చాలా మంచిది. ఇలా చేయడం వలన కుటుంబంలో సంతోషం, ఆనందం ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఉంటె తొలగిపోడానికి అవకాశం ఉంటుంది.

లక్ష్మిదేవిని తామర పూలతో పూజించాలి. అవి అందుబాటులో లేకుంటే ఎర్ర గులాబీ, ఎర్ర మందారం పూలతో పూజ చేయడం తప్పనిసరి. ఇంటిలో పూసిన పూలైతే చాలా మంచిది. అప్పుడే అమ్మవారు సంతృప్తి చెందుతారని వేదంలో చెప్పబడింది.

లక్ష్మి దేవి పూజ సమయంలో నైవేద్యం సమర్పించడం చాలా మంచిది. బియ్యం, బెల్లం తో చేసిన పాయసం మాత్రమే సమర్పించాలి. ఈ విదంగా పాయసం సమర్పించడం వలన లక్ష్మి దేవి అనుగ్రహాన్ని పొందుతామని వేదంలో చెప్పబడింది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *