Home » Dil raju : దిల్ రాజు తో చిత్ర పరిశ్రమ కష్టాలు తొలిగేనా ?

Dil raju : దిల్ రాజు తో చిత్ర పరిశ్రమ కష్టాలు తొలిగేనా ?

Dil raju : సంధ్య థియేటర్ ఘటన తెలుగు చిత్ర పరిశ్రమను ఒక్క కుదుపు కుదిపేసింది. ఈ ఘటనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఒక్క సారిగా అసెంబ్లీ సాక్షిగా కఠిన నిర్ణయం తీసుకొంది ప్రభుత్వం. బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్ల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం తలుపులు మూసి వేసింది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వచ్చే సినిమాల పెట్టుబడిదారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వచ్చిన కష్టాలను తొలగించే భాద్యత దిల్ రాజు పైన పెట్టుకున్నారు చిత్ర పరిశ్రమ పెట్టుబడి దారులు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ అసోసియేషన్‌ స్వాగతించింది. టికెట్‌ రేట్లు పెంచడం వల్ల సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు దెబ్బతిన్నాయని అసోసియేషన్ ఆవేదన. సీఎం నిర్ణయంతో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల యాజమాన్యాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడ్ ఏపీ ప్రభుత్వం తీసుకోవాలని సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల యాజమాన్యాలు కోరుతున్నాయి.

FDC చైర్మన్ హోదాలో దిల్ రాజు సీఎం రేవంత్ రెడ్డి తో చర్చలు జరిపి గట్టెక్కించే విధంగా చొరవ తీసుకోవాలని సినీ నిర్మాతలు కోరుతున్నారు. బెనిఫిట్ షో లేకపోయినా ఫరవాలేదు. కనీసం టికెట్ ధరలు పెంచుకునే విదంగా అయినా సీఎం రేవంత్ రెడ్డిని దిల్ రాజు ఒప్పిస్తే సరిపోతుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ పెట్టుబడి దారులు దిల్ రాజు పైననే ఆశలు పెట్టుకున్నారు. ఇవి ఈమేరకు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *