Ghee : ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో అవసరమే. భోజనం లేదా ఇతర ఆహార పదార్థాల్లో నెయ్యిని ఉపయోగిస్తే శరీరానికి అనేక లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నెయ్యి వలన శరీరానికి కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం.
నెయ్యిలో విటమిన్ A, D, E, K అధికంగా ఉంటాయి. మానవ కణాల పెరుగుదలకు సహాయ పడుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. బరువు తగ్గడానికి, కొవ్వు తగ్గడానికి ఉపయోగపడే మంచి కొవ్వులు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
శరీర జీవక్రియ మెరుగవుతుంది. కొవ్వును శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నెయ్యి తీసుకుంటే ఆకలి కాదు.
నెయ్యితో కాఫీ కలుపుకొని తాగవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని, జీర్ణశక్తిని పెంచుతుంది. మానసిక స్థితిని మెరుగువుతుంది. శరీరంలో శక్తిని, బరువును నిర్వహించడానికి నెయ్యి మంచి పోషకాహరినని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.