Ganjay Transport : అతి తక్కువ రోజుల్లోనే లక్షాధికారులు కావాలని కొందరు కోరుకుంటారు. ఆ కోరిక తీరడానికి ఎదో ఒక పనిచేయాలి. కానీ తక్కువ సంపాదనతో ధనవంతులు కాలేరు. ఆ కోరిక తీరదు. లక్షాధికారి కావాలి. విలాసవంతమైన జీవితం గడపాలి. ఖరీదయిన ఇల్లు ఉండాలి. కారులో షికారు చేయాలి. మరి ఇవన్నీ కావాలంటే డబ్బు ప్రధానం. ఆ డబ్బు సంపాదించడానికి ఏమిచేయాలి ? సక్రమ పద్దతిలో సంపాదించలేము. అక్రమంగానే సంపాదించాలి. కాబట్టి కొందరు అక్రమ వ్యాపారాలను ఎంచుకున్నారు. ఆలా అక్రమంగా వ్యాపారం చేస్తున్న వారికి ఎన్నో అడ్డ దారులు ఉన్నాయి. ఆ అడ్డదారుల్లో గంజాయ్ ఒకటి. గంజాయ్ తో ఎంజాయ్ చేస్తున్న వారు ఎందరో ఉన్నారు…. ఈ గంజాయ్ మత్తు పదార్థం పై స్పెషల్ స్టోరీ … మా ఎడిటర్ న్యూస్ లో… అన్నట్టు చెప్పడం మరచి పోయా… కళ్యాణి … శిలావతి ఎవరు కావాలి అని ముందుగా చెప్పాను కదా .. ఆ ముచ్చట చెప్పడానికి అక్కడికే వస్తున్నా .
గంజాయి అనేది ఒక మత్తు పదార్థం. దీన్ని అరికట్టడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠినమైన చర్యలు చేపట్టారు. గంజాయి తో పట్టుబడిన వారు ఏ స్థాయిలో ఉన్నా వదిలిపెట్టకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. గంజాయ్ ని అక్రమంగా సరఫరా చేస్తూ లక్షలు సంపాదిస్తున్న వారు ఈ గంజాయ్ కి వ్యక్తి గతంగా పేర్లు పెట్టుకున్నారు. గంజాయ్ రెండు రకాలు ఉంటుంది. ఒకటి గింజలతో ఉంటుంది. మరొకటి గింజలు లేకుండా ఉంటది. గింజలు లేని గంజాయ్ కి ధర ఎక్కువ. అదేవిదంగా గింజలు ఉన్న దానికి ధర తక్కువ తో అమ్మకాలు జరుగుతాయి.
రెండు రకాలు ఉన్న గంజాయ్ కి రెండు పేర్లతో స్మగ్లర్లు పిలుస్తారు. కొనుగోలు దారుడు వచ్చినప్పుడు శిలావతి కావాలా. ? కళ్యాణి కావాలా అని అడుగుతారు. శిలావతి అంటే గింజలు లేని గంజాయ్. కళ్యాణి అంటే గింజలు ఉన్న గంజాయ్. ఈ గంజాయ్ వాస్తవానికి ఛత్తీస్ ఘర్ రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో సేకరిస్తారు. అక్కడి నుంచి ఖమ్మం చేరుకుంటుంది. ఖమ్మం నుంచి రైల్ ద్వారా నాగపూర్, నాందేడ్ ప్రాంతాలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి నేరుగా బొంబాయి కి సరఫరా చేస్తారు. బొంబాయి నుంచి తెలంగాణ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
కొనుగోలు చేసిన గంజాయి ని కారులో అవసరం ఉన్న ప్రాంతానికి స్మగ్లర్లు తరలిస్తారు. ముందు ఒక కారు వెళుతుంది. సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో వెనుక మరొక కారు వస్తుంది. వెనుక వచ్చే కారులో గంజాయి ఉంటుంది. ఒకవేళ సంబంధిత శాఖల అధికారులు తనికీ చేస్తున్నారంటే వెనుక కారులో వస్తున్న వారికీ సమాచారం వెళుతుంది. దింతో గంజాయి ఉన్న కారు అక్కడే ఆగిపోతుంది. తనికీలు పూర్తయిన తరువాతేనే చేరుకోవాల్సిన గమ్యానికి గంజాయ్ చేరుతుంది. గంజాయ్ స్మగ్లర్లు చేస్తున్న అక్రమ వ్యాపారానికి ఇది ఒక పద్దతి మాత్రమే.