Home » Coal Mines : కోల్ మైన్స్ సదస్సుకు సమ్మయ్య ఎంపిక ….

Coal Mines : కోల్ మైన్స్ సదస్సుకు సమ్మయ్య ఎంపిక ….

Coal Mines : నాగపూర్ లో ఈ నెల ఎనిమిదో తేదీన నిర్వహించే నేషనల్ కోల్ మైన్స్ కాన్ఫరెన్స్ సదస్సుకు మందమర్రి ఏరియాకు చెందిన సినీయర్ మైనింగ్ సర్దార్, INTUC సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాంపెల్లి సమ్మయ్య ఎంపికయినారు. ఈ సదస్సుకు మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు, యాజమాన్యం నుంచి ఇద్దరు, కార్మిక సంఘం నుంచి ఇద్దరు సింగరేణి విభాగం నుంచి ఎంపిక అవుతారు. అందులో కార్మిక సంఘం నుంచి మందమర్రి ఏరియా సీనియర్ కార్మిక నాయకుడు అయినటువంటి సమ్మయ్య ఎంపిక కావడంతో ఏరియా అధికారులు, యూనియన్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు అభినందించారు.

బొగ్గు గనుల్లో కార్మికుల ఆరోగ్య , రక్షణ సమస్యలపై ఈ సదస్సులో సమీక్షించనున్నారు. గనుల్లో కార్మికులకు కావలసిన రక్షణ ఏవిదంగా కల్పించాలి, రక్షణ సమస్యలను ఏవిదంగా ఎదుర్కోవాలి అనే అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. అదేవిదంగా భూగర్భ గనుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు అతి తక్కువ కాలంలో అనారోగ్యానికి గురవుతున్నారు. వారి ఆరోగ్యాన్ని కాపాడాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై కూడా చర్చించి, కార్మికులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని కాంపెల్లి సమ్మయ్య ఈ సందర్బంగ వివరించారు. దేశంలోని అన్ని బొగ్గు గనుల యాజమాన్యాల నుంచి అరవై మంది ఈ సమీక్ష సమావేశానికి హాజరు కానున్నారని సమ్మయ్య తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *