Home » Pure Vegetarian City : ప్రపంచంలోనే మాంసాహారం ముట్టని నగరం ఎక్కడ ఉందంటే ???

Pure Vegetarian City : ప్రపంచంలోనే మాంసాహారం ముట్టని నగరం ఎక్కడ ఉందంటే ???

Pure Vegetarian City : మాంసాహారం లేనిదే భోజనంలో ముద్దదిగదు. కొందరికి ప్రతిరోజూ ఎదో ఒక మాంసాహారం బోజనంలో ఉండాల్సిందే. కనీసం ఆమ్లెట్ అయినా తప్పనిసరి. ఇంటిలో లేకుంటే బయటకు వెళ్లి హోటల్లో అయినా మాంసాహారం తో భోజనం చేసి వస్తారు. మటన్, చికెన్, ఫిష్, ఎగ్ ఇలా ఎదో ఒకటి తినే వ్యక్తులు, గ్రామాలు, పట్టణాలు తప్పనిసరిగా ఉన్నాయి. ప్రపంచంలో మాంసాహారం తినని ఊరు అంటూ ఎక్కడ ఉండదు అని చెప్పేస్తారు. కానీ మాంసాహారం తినని ఊరు ఉంది. ఆ ఊరి ప్రజలు కనీసం కోడి గుడ్డు కూడా ఇంటిలో వండుకోరు. తినరు. ఇంతకు ఆ ఊరు ఎక్కడ ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో ఉంది. ఇది నిజమేనా ? అంటే అవును నిజమే . ఎక్కడో కాదు మన భారత దేశంలోనే ఉండటం విశేషం. వివరాలలోకి వెలుదాము.

మనదేశంలోనే మాంసాహారం ముట్టని ప్రాంతం ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటి శాకాహార పట్టణంగా గుజరాత్ రాష్ట్రంలోని భావ్ నగర్ జిల్లాలో ఉంది. ఈ జిల్లాకు 55 కిలోమీటర్ల దూరంలో పాలిటానా నగరం ఉంది. ఈ నగరంలో మాంసాహారం ఏ ఒక్కరు కూడా ముట్టరు. అందుకే ప్రపంచంలోనే పేరుపొందింది ఆ నగరం. ఈ పట్టణంలో మాంసాహారం వినియోగాన్ని పూర్తిగా నిషేదించారు. అంతేకాదు జంతువులను చంపడం కూడా చట్టవిరుద్ధం.

కనీసం కోడిగుడ్డు కూడా అమ్మరు. అంటే ఆ పట్టణంలో మాంసాహారంపై విధించిన నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఈ ఒక్క పట్టణంలోనే 900 పైబడి దేవాలయాలు ఉన్నాయి. ఇన్ని దేవాలయాలు ప్రపంచంలో ఏ ఒక్క పట్టణంలో లేవు. అక్కడ ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం పేరు శత్రుంజయ. ఆ పర్వతం పై ఉన్న దేవాలయానికి చేరుకోవాలంటే 3950 మెట్లు ఎక్కితే గాని ఆలయానికి చేరుకోలేము.

జైన మతానికి చెందిన సన్యాసులు భారీ సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్నారు. అందుకే ఈ ప్రదేశంలో మాంసాహార విక్రయాలను నిలిపివేయాలని.. జంతువుల వధను నిషేధించాలని వారు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దాదాపు 200 మంది జైన సన్యాసులు నిరాహారదీక్ష చేయడం ద్వారా నిరాహార దీక్ష చేయడం ద్వారా నిషేధం అమలులోకి వచ్చింది. 2014లో ప్రభుత్వం ఈ ప్రాంతంలో
జంతు వధపై నిషేధం విధించింది. అప్పటినుంచి ఈ నగరంలో జంతువులను చంపడాన్ని పూర్తిగా నిషేధించింది.

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *