Singareni : సింగరేణి బొగ్గు గని కార్మికులకు వైద్యం విధానంలో ఐఎన్టీయూసీ మెరుగయిన ఒప్పందం సాధించిందని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (INTUC ) కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య తెలిపారు. గురువారం ఆయన మందమర్రిలో మాట్లాడుతూ కార్మికులు హైదరాబాద్ లో ఉన్నత చికిత్స కు వెళ్లాలంటే అనేక ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు అటువంటి ఇబ్బందులన్నిటిని ఐఎన్టీయూసీ తొలగించిందన్నారు. యూనియన్ సెక్రెటరి జనరల్ బి జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు సింగరేణి కార్మికులకు అందుతున్న వైద్య సేవలపై చర్చించడం జరిగిందన్నారు.
చర్చలల్లో భాగంగా గతంలో ఉన్నటువంటి వైద్య నిబంధనలను పూర్తిగా తొలగించడం జరిగిందన్నారు. కార్మికుడు, అతనిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల్లో ఎవరైన చికిత్స కోసం ఏరియా ఆసుపత్రికి వెళితే. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ లోని సింగరేణికి అనుబందంగా ఉన్న ఏదయినా కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోడానికి అవకాశం కల్పించడానికి యాజమాన్యం అంగీకరించిందన్నారు. ఆసుపత్రి నుంచి విధులు నిర్వహించే గని, అక్కడి నుంచి కార్పొరేట్ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.