Home » ఆ రైల్వే స్టేషన్ లో ఎన్ని కష్టాలో ….

ఆ రైల్వే స్టేషన్ లో ఎన్ని కష్టాలో ….

మందమర్రి స్టేషన్ లో అరకొర వసతులు
టికెట్ కావాలంటే రైల్ కింది నించి వెళ్లాల్సిందే
సింగరేణి ప్రాంతమైన మందమర్రిలో సింగరేణి రైల్ ఆగదు
పట్టించుకోని ప్రజాప్రతినిధులు

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

పెద్దపల్లి పార్లమెంట్, చెన్నూర్ నియోజకవర్గం పరిధిలో మందమర్రి రైల్వే స్టేషన్. ఈ రెండు నియోజకవర్గంల నుంచి నాయకులు స్థానిక, స్థానికేతర నాయకులు అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకు ఎన్నికయిన వారు ఉన్నారు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పార్టీ టికెట్ పొంది అందలం ఎక్కిన నాయకులు కూడా ఉన్నారు. నాయకులు అందలం ఎక్కుతున్నార, దిగుతున్నారు. కానీ మందమర్రి రైల్వే స్టేషన్ ప్రయాణికులకు అందనంత దూరంలోనే ఉందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మంచిర్యాల జిల్లా కన్వీనర్, మాదిగ హక్కుల దండోరా మందమర్రి పట్టణ కమిటీ కన్వీనర్ కొలుగురి విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మందమర్రి పట్టణాన్ని అనుకొని ఉన్న 1,2,3 జోన్ కాలనీలతోపాటు సమీపంలోని చిర్రకుంట, పొన్నారం, మామిడిగట్టు, సారంగపల్లి గ్రామాల నుంచి ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచే దూర ప్రాంతాలకు వెళ్లి వస్తుంటారు. మందమర్రి పట్టణంలో బస్సు స్టాండ్ ఉన్నప్పటికీ బస్సు సౌకర్యం లేకపోవడంతో రైల్ ప్రయాణాన్ని ఆశ్రయిస్తున్నారు ఆయా ప్రాంత ప్రజలు. ఉదయం తెల్లవారుజామున భాగ్యనగర్ రైల్ కు వెళ్లాలన్నా, అదే రైల్ రాత్రి దిగి రావాలన్నా చీకటిలో అడ్డుగా ఉన్న రైల్ కిందినుంచి దాటుకుంటూ వెళ్ళాలి. టికెట్ తెచ్చుకోవాలి.
పగటిపూట ఇతర రైల్ కు వెళ్లాలంటే కూడ ఇదే పరిస్థితి నెలకొందని ప్రయాణికులు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

 

మందమర్రి స్టేషన్లో కేవలం భాగ్యనగర్, కాజిపేట్ ఎక్స్ ప్రెస్, ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైళ్లు మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉన్నవి. రామగిరి, సింగరేణి, సిర్పూర్-సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ రైళ్లు మాత్రం అందుబాటులో లేవు. సింగరేణి ప్రాంతమైన మందమర్రి లో సింగరేణి ఎక్స్ ప్రెస్ రైల్ మందమర్రి కార్మికులకు అందుబాటులో లేదంటే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులతోపాటు వివిధ పార్టీల నాయకులకు కార్మిక కుటుంబాలపై ఎంత ప్రేమ ఉందొ చెప్పాల్సిన అవసరం లేదు. సింగరేణి ప్రాంతం కానీ స్టేషన్ లో సింగరేణి రైల్ అక్కడి ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. కానీ సింగరేణి రైల్ సింగరేణి కార్మిక కుటుంబాలకు అందుబాటులో లేకపోవడం శోచనీయం. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు స్పందించి స్టేషన్ లో సౌకర్యాలతోపాటు అదనపు రైల్ల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మంచిర్యాల జిల్లా కన్వీనర్, మాదిగ హక్కుల దండోరా మందమర్రి పట్టణ కమిటీ కన్వీనర్ కొలుగురి విజయ్ కుమార్తోపాటు పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *