తాడిచెర్ల బొగ్గు గనికి కేంద్రం అనుమతి
కొత్తగూడెం నుంచి భూపాలపల్లి వరకు పర్యటన
బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
తాడిచెర్ల బొగ్గు గనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిన నేపథ్యంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సోమవారం ఉమ్మడి కోల్‌బెల్ట్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం నుంచి భూపాలపల్లి వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని స్థానిక ప్రజాప్రతినిధులు, సింగరేణి అధికారులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ మాట్లాడుతూ, తాడిచెర్ల బొగ్గు గనికి కేంద్రం అనుమతి ఇవ్వడం సింగరేణి సంస్థకు ఎంతో కీలకమైన పరిణామమని పేర్కొన్నారు. ఈ గని ప్రారంభం ద్వారా బొగ్గు ఉత్పత్తి పెరగడంతో పాటు సింగరేణి సంస్థ ఆర్థిక పరిస్థితి మరింత బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపడుతున్న కోల్‌బెల్ట్ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలోని బీజేపీ మైనార్టీ మోర్చా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.కేంద్ర ప్రభుత్వం సింగరేణి అభివృద్ధికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తోందని, తాడిచెర్ల గనికి అనుమతి కూడా అదే దిశలో తీసుకున్న కీలక నిర్ణయమని రజనీష్ జైన్ పేర్కొన్నారు. ఈ పర్యటన ద్వారా కోల్‌బెల్ట్ ప్రాంత అభివృద్ధి, సింగరేణి భవిష్యత్తుపై మరింత స్పష్టత లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు

by