Home » BJP Mla : బీజేపీ కి తలనొప్పిగా తయారైన ఆ ఎమ్మెల్యే

BJP Mla : బీజేపీ కి తలనొప్పిగా తయారైన ఆ ఎమ్మెల్యే

BJP Mla : భారతీయ జనతా పార్టీ అంటేనే క్రమశిక్షణ గల పార్టీ అని పేరు ఉంది. సంఘ్ పరివార్ కనుసన్నల్లో కోనసాగుతుందనే పేరు కూడా ఉంది. పార్టీ హద్దులు దాటిన వారికి వేటు తప్పదు. నాయకుడు ఎంతటి వారైనా సరే. క్రమశిక్షణకు కట్టుబడి పని చేయాల్సిందే. ఇటువంటి పేరు ఉన్న పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే దూకుడు వ్యవహారం తలనొప్పిగా తయారైనది అనే అభిప్రాయాలు రాష్ట్ర నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు. గోష్ మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్.

ఇటీవల ఎమ్మెల్సి కవిత మాట్లాడుతూ బిఆర్ఎస్ , బీజేపీ లో విలీనం ఖాయమంటూ ఆరోపణలు చేసింది. ఈ విషయంపై రాజాసింగ్ మాట్లాడుతూ కవిత మాట్లాడిన మాటలు నిజమేనన్నారు. ప్రతి ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీ నాయకులతో బీజేపీ తో కొమ్ముక్కు అయ్యారని కూడా మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారాయి. మరో సందర్భంలో రాజాసింగ్ మాట్లాడుతూ సొంత ఇంటి పైననే వివాదాస్పదమైన వాక్యాలు చేశారు. దొంగలు అంతా ఒక్కటై తనపై యుద్ధం చేయడానికి సిద్ధం అయ్యారని ఆరోపించారు. కరీంనగర్ నుంచే తనపై యుద్ధం కూడా మొదలైనదని ఆరోపించారు.

తాను పార్టీలో చేరిన నాటి నుంచి వేధింపులు మొదలైనాయని, వాటిని భరిస్తూనే ఉన్నానని, పార్టీకి తాను అవసరం లేదనుకుంటే వెళ్ళిపోడానికి సిద్ధంగా ఉన్నానంటూ మాట్లాడిన మాటలు సంచలనంరేపాయి. పదవీ విరమణ పొందిన నాయకులు పార్టీ విడిచి వెళితేనే తెలంగాణాలో పార్టీ అధికారం వస్తుందని కూడా రాజా సింగ్ సంచలనమైన కామెంట్ చేయడం విశేషం. తనకు నోటీసులు వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోందని, వాటికీ భయపడనని అన్నారు. ఒకవేళ నన్ను సస్పెండ్ చేస్తే ఎవరివల్ల పార్టీకి నష్టం జరిగిందనే విషయాన్నీ కూడా బయట పెట్టడం ఖాయమంటూ రాజాసింగ్ రాష్ట్ర నాయకత్వాన్ని హెచ్చరించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *