CPM : తెలంగాణ రాష్ట్ర ప్రజలచే ఎన్నుకోబడిన బీజేపీ ప్రజాప్రతినిధులకు బీసీ రిజర్వేషన్ అమలు కావాలని చిట్టా శుద్ధి ఉంటే తమ పదవులకు వెంటనే రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సీపీఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి డిమాండ్ చేశారు. గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్బంగా సంకె రవి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ అమలు చేసిన నేపథ్యంలోనే బీసీలకు సరైన న్యాయం జరుగుతుందన్నారు. గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్న బీసీ బిల్లును వెంటనే ఆమోదం తెలిపే విదంగా రాష్ట్రంలోని బీజేపీ నాయకులు కేంద్రం పై ఎందుకు ఒత్తిడి చేయడంలేదని ఆయన ప్రశ్నించారు. ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన బంద్ లో బీజేపీ నేతలు పాల్గొనడం కూడా అంతా నాటకమేనన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే అన్ని పార్టీల నాయకులను ఢిల్లీ తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. అసెంబ్లీ లో ఆమోదం చేసిన బిల్లును కేంద్రం పై ఒత్తిడి తీసుకువచ్చి ఆమోదం పొందాల్సిన భాద్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బొడేంకి చందు సీపీఎం చెన్నూర్ మండల కార్యదర్శి, ,దాసరి రాజేశ్వరి సీపీఎం జిల్లా సీనియర్ నాయకురాలుతో పాటు నాయకులు సామల ఉమ రాణి, కరీంభి, సిడం సమ్మక్క, తుమ్మ రేణుక, రాతిపల్లి నగేష్, K.చంద్రన్న, బండారి రాజేశ్వరి, పాయి రాల రాములు, M.బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు…

by