కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
“నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే” (జాతీయ పతాకాన్ని జాతికి అందించిన రోజు) సందర్భంగా బిబిపేటలోని వాసవి క్లబ్ ఆవరణలో బుధవారం జాతీయ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. దేశ ఐక్యత, సమగ్రతకు ప్రతీకగా నిలిచిన త్రివర్ణ పతాకానికి సభ్యులు గౌరవ వందనం చేసి జాతీయ భావాన్ని చాటిచెప్పారు.
ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ అధ్యక్షుడు మురికి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, కార్యదర్శి రెడ్డిశెట్టి శ్రీనివాస్, కోశాధికారి జోర్రిగల శ్రీనివాస్ పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా వైస్ గవర్నర్ బాశెట్టి నాగేశ్వర్, జోన్ చైర్మన్ తోడుపునూరు నాగభూషణం, ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి తోడుపునూరి శ్రీనివాస్, కోశాధికారి ఇల్లెందుల ఆంజనేయులు హాజరయ్యారు.
అదేవిధంగా నంగునూరు చంద్రశేఖర్, నీలబైరయ్య, రెడ్డిశెట్టి వెంకటేశం, తోడుపునూరి సాయి చందు, కాశిట్టి వీరేశం, పడకంటి విజయ్ కుమార్, బచ్చు లక్ష్మణ్, స్వామి తదితరులు కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకం విశిష్టతను వివరించారు. అదే విదంగా భారత జాతీయ పతాకం దేశ గౌరవానికి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు జాతీయ పతాకాన్ని గౌరవించి దేశభక్తి భావనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

by