Home » Jim : ఉదయం ఏమి తినకుండానే వ్యాయామం చేస్తే ఏమవుతుందో తెలుసా ?

Jim : ఉదయం ఏమి తినకుండానే వ్యాయామం చేస్తే ఏమవుతుందో తెలుసా ?

Jim : ఆరోగ్యముగా ఉండటానికి చాలా మంది జిమ్ కు వెళ్లి వ్యాయామం చేస్తారు. నిద్ర లేవగానే వెంటనే జిమ్ కు వెళుతారు. రోజుకు అర్ద గంట నుంచి గంట వ్యాయామం చేస్తారు. కానీ వ్యాయామం చేయడానికి ముందు తిని చేయాలా ? తినకుండా చేయాలా అనేది చాలా మందికి అనుమానం. ఈ సందేహం గురించి ఇప్పుడు తెలుసుకుందాం…..

రాత్రివేళ నిద్రపోయిన తరువాత మన శరీరంలో గ్లైకోజెన్ శాతం తగ్గిపోతుంది. ఉదయాన్నే నిద్రలేవగానే గ్లైకోజెన్‌కు బదులు శరీరంలో కొవ్వు శాతం అనేది వేగంగా ప్రవాహం చెందుతుంది. ఈ నేపథ్యంలో ఉదయం నిద్ర లేవగానే వ్యాయామం చేయాలా ? వద్దా అనే సందిగ్ధం ఏర్పడుతుంది. ఖాళీ కడుపుతో వ్యాయామం చేసిన వారు గ్లైకోజెన్ తో శారీరకంగా నష్టపోతారు. శరీరం బలహీనం అవుతుంది. అందుకే ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం మంచిది కాదని జిమ్ నిర్వాహకులు చెబుతున్నారు.

వ్యాయామం చేయడానికి ముందు ఒకటి లేదా రెండు అరటిపళ్ళు తినాలని జిమ్ నిర్వాహకులు సూచిస్తున్నారు. అరటి పండులో ఉండే పొటాషియం, పిండి పదార్థాలు శరీరానికి బలాన్నిస్తాయి. లేదంటే ఆపిల్ తిని జిమ్ కు వెళ్ళాలి. ఇవి తినడం వలన పొట్ట నిండుగా ఉంటుంది. కాబట్టి జిమ్ కు వెళ్లే ముందు ఈ రెండింటిలో ఎదో ఒకటి తిని వెళ్లడం ఆరోగ్యానికి మంచిదని జిమ్ నిర్వాహకులతో పాటు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *