Congress Party : ఎవరు తోడుకున్న బొందలో వాళ్ళే పడుతారు అనే సామెత కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకు ఎక్కువగా వర్తిస్తుంది. ఎన్నికల సమయానికి రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోంది. పెరుగుతున్న గ్రాఫ్ ను తగ్గించడానికి ఎంతోమంది నాయకులు విశ్వప్రయత్నాలు చేశారు. అధిష్టానంపై రేవంత్ రెడ్డి కారణం చూపించి మరో కండువా వేసుకున్నారు. అందులో ముందువరుసలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు ఉన్నారు.
అధిష్టానంకు ఎవరు ఎన్ని ఫిర్యాదులు చేసినా, పార్టీ నుంచి వెళ్ళిపోయినా పట్టుదలతో పీసీసీ అధ్యక్షుడి హోదాలో ముందుకు వెళ్ళాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేశారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారం చేపడుతుందని తెలిసి మరోసారి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కొందరు. అలాంటి వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఒకరు కావడం విశేషం.
పదవి గురించి ఆశపడటమే రాజగోపాల్ రెడ్డి కి తెలుసు. కానీ రాజకీయం గురించి తెలియదు అని అయన అనుచరులే చెబుతారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బలోపేతం అయితే పార్టీ కూడా అభివృద్ధి చెందినట్టు. వ్యక్తిగత సామర్ధ్యానికి మించి పదవులు పొందాలని ఆశపడేవారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అగ్రశ్రేణిలో ఉంటారనే పేరు ఉంది పార్టీలో.
ఒకవేళ ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలంటే ఆయన సోదరుడి పదవిని తీసివేయాలి. ఒకవేళ పదవి ఇద్దామంటే పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు పట్టుకొని ఉన్నాడంటే అదికూడా లేదు. కష్టాల్లో ఉన్న పార్టీని మరింత తొక్కడానికి కషాయం కండువా కప్పుకొని మునుగోడు ఉపఎన్నికను సాధించి పెట్టిన మహా నేత. ఇప్పుడు పార్టీ అభ్యర్థిగా గెలిచి మంత్రి పదవి కావాలంటే ఎలా సాధ్యమవుతుంది అని అయన అనుచరులే లోలోన చెవులు కొరుక్కుంటున్నారు.